అవసరమైతే ఆదిలాబాద్ బాధ్యతలు తీసుకుంటా: కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-11-28 15:36:23.0  )
అవసరమైతే ఆదిలాబాద్ బాధ్యతలు తీసుకుంటా: కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, ముధోల్: ఎంఐఎం, టీఆర్ఎస్ ఆటలు రానున్న రోజుల్లో ఇక సాగవని బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం బైంసా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ 86 వేల మెజార్టీ ఓట్లతో నైతిక విజయం సాధించిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అవసరమైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు తీసుకుని.. 10 అసెంబ్లీ స్థానాలలో కమలం వికసించడానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఇప్పటినుండే ప్రతి కార్యకర్త బీజేపీ ఎదుగుదలకు పనిచేయాలని సూచించారు.

Advertisement

Next Story