- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ ప్రయాణికునికి ఆర్టీసీ వీరబాదుడు..
దిశ, కన్నెపల్లి : ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల పై అధిక చార్జీలను వసూలు చేస్తుంది. వివరాల్లోకెళ్తే మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామం నుండి ముత్తాపూర్ వెళ్లేందుకు బుధవారం ఉదయం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఎక్కిన ప్రయాణికునికి ఎనిమిది కిలోమీటర్ల దూర ప్రయాణానికి ఆర్టీసీ అధికారులు 30 రూపాయల టికెట్ ఇచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంటే ఆర్టీసీ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పల్లె వెలుగు బస్సుల్లో ఎనిమిది కిలోమీటర్ల దూరానికి 30 రూపాయల చార్జీలు వసూలు చేయడం పై ప్రయాణికులు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంత గ్రామాల ప్రజలకు రవాణా సేవలందించేందుకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు చేపడుతుంటే ఓ ప్రయాణికుడి నుండి ఇలా అధిక చార్జీలను వసూల్ చేయడం ఆర్టీసీ నిర్లక్ష్య వైఖరి కారణం ప్రతినిత్యం బెల్లంపల్లి నుండి మెట్టుపల్లి, లింగాల వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. బుధవారం ఉదయం మెట్టుపల్లి నుండి ముత్తాపూర్ వరకు ప్రయాణించేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు నెంబర్ ఏపీ 29 జెడ్ 1854 లో ప్రయాణం చేసిన ఓ ప్రయాణికుడి టిక్కెట్ ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపే కండక్టర్లకు దూరాన్ని బట్టి టికెట్ ని కేటాయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆ టికెట్ ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను.. తోకల బానయ్య మెట్టుపల్లి
ప్రతిరోజు నేను మెట్టుపల్లి నుండి కన్నేపల్లికి ఆర్టీసీ పల్లె వెలుగులోనే బస్సు ప్రయాణం చేస్తాను. బుధవారం రోజులాగే బస్సు ఎక్కి కండక్టర్ ను ముత్తపూర్ టికెట్ ఇవ్వాలని అడిగితే దానికి 30 రూపాయల టికెట్ ను అందించారు. ప్రతిరోజు 20 రూపాయలు తీసుకుంటున్నారు కదా అని ప్రశ్నిస్తే ఈరోజు ఇంతే అని నిర్లక్ష్యం సమాధానాన్ని చెప్పాడు.