Addamki : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే కనుమరుగు చేయాలని చూసింది: అద్దంకి

by Y. Venkata Narasimha Reddy |
Addamki : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే కనుమరుగు చేయాలని చూసింది: అద్దంకి
X

దిశ, వెబ్ డెస్క్ : దీక్షా దివాస్ పేరుతో గత రోజులను గుర్తు చేసుకునేందుకు బీఆర్‌ఎస్(BRS) ప్రయత్నిస్తోందని కాంగ్రెస్(Congress) నేత అద్దంకి దయాకర్ (Addamki Dayakar)ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని బీఆర్ఎస్ చూసిందని, అందుకోసం బీజేపీతో కలిసిందని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం లేని బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అమరుల త్యాగాలను మరచిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని దుయ్యబట్టారు. లగచర్ల ప్రజల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం ద్వారా ప్రజా ప్రభుత్వం ఎట్లా ఉంటదో చూపిస్తుందన్నారు.

బీఆర్ఎస్ పాలనలో భూసేకరణ పేరుతో ఎంతమంది రైతుల ఉసురు పోసుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల మనసులు తెలుసుకోకుండా పాలన చేయడం..ప్రతిపక్షంలో ఉద్యమకారులమనిపించుకోవడం, మళ్లీ అవకాశమొస్తే ఏ విధంగా దోచుకోవాలనే ఎత్తుగడతోనే బీఆర్ఎస్ పనిచేస్తుందని ప్రజలు గ్రహించారని మీ ఎత్తుగడలు ఇక పనిచేయవన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకే, సోనియాగాంధీ ఆకాంక్షల సాధనకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి సహకరించాలని, లేదంటే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు.

Advertisement

Next Story