- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ గ్రూప్స్.. పెట్టుబడులపై కీలక చర్చలు..!
by Satheesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్స్ సభ్యులు కలిశారు. రాష్ట్రానికి పెట్టుబుడలకు సంబంధించిన కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. అనంతరం అమరరాజా గ్రూప్ కో-ఫౌండర్, చైర్మన్ గల్లా జయదేవ్ సైతం ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. వారితో సైతం కీలక చర్చలు జరిపారు. కాగా, అమరరాజా గ్రూప్ గతంలోనే తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే లిథియం- అయాన్ బ్యాటరీ తయారీకి పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అప్పటి సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Next Story