జూన్ 4న ‘‘ఉద్యమకారుల అలయ్-బలయ్’’: జిట్టా బాలకృష్ణా రెడ్డి

by Satheesh |
జూన్ 4న ‘‘ఉద్యమకారుల అలయ్-బలయ్’’: జిట్టా బాలకృష్ణా రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని భువనగిరిలో జూన్ 4న అలయ్-బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ఆహ్వానప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా జిట్టా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అలయ్-బలయ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యమజ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురిని ఆహ్వానించామని, అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఉద్యమకారులంతా తరలివచ్చి అలయ్ బలయ్‌ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు పోటోళ్ల శ్యాం గౌడ్, చింతల లక్ష్మీనారాయణ, సోమరం శంకర్, రత్నపురం శ్రీనివాస్, కాడెం సాయిలు, పాశం శంకర్ రెడ్డి, వంగురి స్వామి, పల్లా భాస్కర్ రెడ్డి, సతీష్ నాయక్, ప్రశాంత్, అజయ్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed