ఫోన్ ట్యాపింగ్ లో కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం

by M.Rajitha |
ఫోన్ ట్యాపింగ్ లో కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చెపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారించింది. రాష్ర్ట వ్యాప్తంగా సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ కుమార్ కీలకంగా వ్యహరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు కు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ లో అతని పాత్రపై ఎస్ఎస్ఎల్ నివేదికలో అనేక విషయాలు ఉన్నాయన్నారు. శ్రవణ్ కుమార్ నేరస్తుడిగా పరిగణించాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని పీపీ కోర్టును కోరారు. శ్రవణ కుమార్ తరపు న్యాయవాది ఫోన్ ట్యాపింగ్ కేసుకు శ్రవణ్ రావు సంబంధం లేదని తన వాదనలలో హైకోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు పరిశీలించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తు ఉత్తర్వులు ఇచ్చింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెబీ కేంద్రంగా విచ్చలవిడిగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 2023 మార్చి10న కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్ట్ చేయడంతో శ్రవణ్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. శ్రవణ్‌రావు మార్చి 15న మొదట లండన్‌కి వెళ్లి అదే నెల 20న అమెరికా చేరుకున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో ఉంటున్నట్లు గుర్తించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా చేర్చాక వారి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఈ కేసులలో ప్రధాన నిందుతుడిగా పేర్కోన్న ఎస్ ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు కూడా అమెరికాలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. వీరిని రాష్ట్రానికి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ఎక్స్ ట్రెడిషన్ ( నేరస్తుల అప్పగింత) అస్త్రంను ప్రయోగించనున్నారు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్‌కు అమెరికాకు మధ్య ఒప్పందాన్ని వీరి పై అమలపరిచేందుకు సీఐడీ అధికారులు కేంద్రానికి నివేదికను పంపారు.

శ్రవణరావును తిరిగి దేశానికి రప్పించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు శ్రవణరావు వీసా గడువు ముగిసిన అమెరికాలో అక్రమ వలసదారుగా ఉంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులకు కసరత్తు చేశారు. ఆ నేపధ్యంలో అమెరికా ఉంటున్న శ్రవణ్ రావు ఇండియాకు రాకుండా తన అడ్వకేట్ ద్వారా హైకోర్టులో ముందుస్తూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులలో ప్రధాన నిందుతుడిగా పేర్కోన్న ప్రభాకర్ రావు కుడా అమెరికాలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు , ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) డీఎస్పీ ప్రణీత్ , మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ డిసీపీ రాధకిషన్ రావు నిందితులుగా మొత్తం ఆరుగురిని చేర్చారు. వీరిలో తిరుపన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, భుజంగరావు, రాధకిషన్ రావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డీఎస్పీ ప్రణీత్ మాత్రమే జైలులో ఉన్నాడు.



Next Story

Most Viewed