ACB Raids: ప్రభుత్వ హాస్టల్స్‌‌లో ఏసీబీ రెయిడ్స్.. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు

by Prasad Jukanti |
ACB Raids: ప్రభుత్వ హాస్టల్స్‌‌లో ఏసీబీ రెయిడ్స్.. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాల్లో ఈ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఏసీబీ అధికారులు హాస్టల్స్‌కు చేరుకుని సోదాలు చేస్తున్నారు. వసతి గృహాల్లో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు? రికార్డుల్లో ఎంత మంది వివరాలు ఉన్నాయి? ఆహార నాణ్యత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. రికార్డులు పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఈ తనిఖీలు ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. హాస్టల్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, తప్పుడు బిల్లులతో విద్యార్థులకు అందించాల్సినవి పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఈ రెయిడ్స్ చేపట్టినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story