- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతి అధికారులను కోర్టులో హాజరు పరిచిన ఏసీబీ
దిశ, జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెండు రోజులపాటు సాగిన ఏసీబీ దాడులు నేటితో ముగిశాయి. రూ.2 లక్షల లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావు దేశ్‌ముఖ్, మేనేజర్ మనోహర్, అటెండర్ రాకేష్ (ఔట్‌సోర్సింగ్)లను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. ఏసీబీ అదనపు ఎస్పీ నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అదే విధంగా కేసుకు సంబంధించిన పలు దస్త్రాలను ఏసీబీ అధికారులు సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రధానంగా వీటిలో మ్యుటేషన్ పెండింగ్ కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ కోర్టుకు తీసుకుపోయినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా ఏసీబీ దాడుల సందర్భంగా కార్యాలయంలో నుంచి సిబ్బంది ఎవరు కూడా రెండు రోజుల వరకు బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. వారికి అన్న పానీయాలు కార్యాలయంలోని సమకూర్చారు. దాడులు జరుగుతున్నంత సేపు బయట ఉన్న మున్సిపల్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఆ చుట్టుపక్కల కనిపించకపోగా.. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంచినట్లు సమాచారం. దీంతో వారిపై కూడా ఏసీబీ అధికారులు నిఘాపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.