Formula race case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు త్వరలో కీలక మలుపు?

by Prasad Jukanti |
Formula race case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు త్వరలో కీలక మలుపు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు (Formula-E Car Race) విచారణలో ఏసీబీ (ACB) స్పీడ్ పెంచింది. ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్న ఏ1 మాజీ మంత్రి కేటీఆర్ (KTR), ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (Arvind Kumar), ఏ3 హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ని ప్రశ్నించిన ఏసీబీ వారి స్టేట్ మెంట్ లను రికార్డు చేసింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ ఈవోకు నిధులు బదలాయించారనే ఆరోపణలతోనే ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏసీబీ గతంలో ఎఫ్ఈవో సీఈవోకు నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హజరు అయ్యేందుకు నెల రోజుల సమయం కావాలని ఏసీబీని ఎఫ్ఈవో కంపెనీ విజ్ఞప్తి చేయగా ఏసీబీ అందుకు అంగీకరించింది. ఆ గడువు పూర్తికావడంతో ఎఫ్ఈవో సీఈవో (FEO CEO) ఇవాళ విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ మేరకు తాను లండన్ నుంచి వర్చువల్ గా విచారణకు హాజరు అవుతానని ఎఫ్ఈవో సీఈవో ఏసీబీ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ విచారణ తర్వాత కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫార్ములా అగ్రిమెంట్స్, నిధుల మళ్లింపు లెక్కలు ఎఫ్ఈవో వద్దనే ఉన్న నేపథ్యంలో ఎఫ్ఈవో సీఈవో స్టెట్ మెంట్ ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కాబోతున్నదని, సీఈవో ఈ విచారణ అనంతరం దర్యాప్తులో కీలక పరిణామాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు అవుతారనే ప్రచారం జోరుగా జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement
Next Story