- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆలయంలో అద్భుత దృశ్యం.. శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ సమీపంలోని వెంకటగిరిలో గల శ్రీ వీరాంజనేయ స్వామి వారి సన్నిధిలో గల శివలింగం నుదుటిపై సూర్యకిరణాలు సింధూరమై మెరిశాయి. నేడు(శనివారం) శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు నేరుగా శివలింగం నుదుటిపై పడటంతో భక్తులు ఆసక్తిగా చూశారు. ఈ క్రమంలో భక్తులు మొక్కులు మొక్కుకొని కోరికలు కోరుకున్నారు. ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను ఎలా అయితే సూర్యకిరణాలు తాకుతాయో అలాగే సూర్య కిరణాలు శివయ్య పాదాలను తాకాయంటూ భక్తుల మురిసిపోయారు. దీంతో ఆలయమంతా శివనామ స్మరణలతో మారు మోగింది. లేలేత కిరణాలు నేరుగా శివున్ని తాకిన దృశ్యాలను చూసి వీరాంజనేయ స్వామి సన్నిధానంలో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.
ఆలయంలో భజనలు, నిత్య పూజలతో స్వామి వారిని కొలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. రామాంజి గురుస్వామి.. ఉదయం 6.35 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో వీక్షించారు. శివలింగంపై సూర్యకిరణాలు ఆవిష్కృతం అయిన సమయంలో.. శివయ్యను దర్శనం చేసుకున్న వారిలో సంతోష్ శర్మ గురుస్వామి, సందీప్ స్వామి, వేణు గురు స్వామి, శ్రీనివాస్ గురు స్వామి, శ్రీశైలం స్వామి, సురేంద్ర యాదవ్ స్వామి, గణేష్ స్వామి, విజయ్ గురుస్వామి, గంగాధర్ స్వామి, శ్రీహరి స్వామి, యశ్వంత్ స్వామి, శివయ్య భక్తులు, తదితర భక్తులు ఉన్నారు.