ఉద్యమకారులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: రవికుమార్ డిమాండ్

by Satheesh |
ఉద్యమకారులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: రవికుమార్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారుల ప్రయోజనాలు కొరకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్యమకారుడు, విద్యార్థి జన సమితి రాష్ట్ర కార్యదర్శి మాలోతు రవికుమార్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ అస్తిత్వం కోసం 2001 నుంచి 2012 వరకు ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా ఊరూరు తిరిగి ప్రజలను ఏకం చేసి తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేశామన్నారు.

ఆంధ్ర పెత్తనం పోయి తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలైన వనరులను వాడుకోవాలని తెలంగాణ వాదం.. నినాదం ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, సకల జనుల సమ్మెలో పాల్గొని పోరాటాల వాదం వినిపించి ముందుండి పోరాడినామని గుర్తుచేశారు. పోరాటాల త్యాగాల పునాదులతో ఏర్పడిన సంకేతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఇకనైనా ఉద్యమకారుల ప్రయోజనాలు కొరకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story