జపాన్ బుల్లెట్ ట్రైన్ చరిత్రలో అరుదైన ఘటన.. వింత కారణంతో 17 నిమిషాలు ఆలస్యం

by Prasad Jukanti |
జపాన్ బుల్లెట్ ట్రైన్ చరిత్రలో అరుదైన ఘటన.. వింత కారణంతో 17 నిమిషాలు ఆలస్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో:జపాన్‌లో చాలా గొప్పగా చెప్పుకునే బుల్లెట్ ట్రైన్ ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకోవడం అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటి బుల్లెట్ ట్రైన్ మంగళవారం సాయంత్రం నగోయా-టోక్యో మధ్య ఏకంగా 17 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. దీనికి ఓ పాము కారణం అయింది. ఇందకీ ఏం జరిగిందంటే.. నిన్న సాయంత్రం రైలుపై ప్రయాణికులు ఓ పామును గుర్తించారు. దీంతో ఆ పాము కారణంగా రైలును ఆలస్యంగా నడపవల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇంతకు ఆ పాము అక్కడికి ఎలా వచ్చిందో పరిశీలిస్తున్నామని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. నిజానికి జపాన్ బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణికులు పావురాలు, చిన్న కుక్క పిల్లలను వెంట తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ పాములు తరలించేందుకు పర్మిషన్ లేదు. ఈ నేపథ్యంలో ఆ పాము రైలులోకి ఎలా చేరింది అనేది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బుల్లెట్ ట్రైన్ ను జపాన్ లో 1964 అక్టోబర్ 1న ప్రారంభించారు. ప్రారంభంలో దేశ రాజధాని టోక్యో నుంచి ఒసాకా మధ్య రాకపోకలు సాగించిన జపాన్ షింకాన్ సెన్ నెట్ వర్క్.. 2,700 కిలోమీటర్ల వరకు విస్తరించింది. సమయపాలనకు, కచ్చితత్వానికి పెట్టింది పేరులా ఉన్న జపాన్ బుల్లెట్ రైళ్ల ఆలస్యం సరాసరి నిమిషం కన్నా చాలా తక్కువే ఉంటుంది. ప్రస్తుతం ఈ బుల్లెట్ ట్రైన్స్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి.

Advertisement

Next Story