NLG: నార్కట్‌పల్లి శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

by GSrikanth |
NLG: నార్కట్‌పల్లి శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story