- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
HYD: బాబా చెప్పాడని ఇంట్లోనే సమాధి నిర్మాణం!
దిశ, బడంగ్పేట్: హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేగింది. బాబా చెప్పాడని ఇంట్లోనే సమాధి నిర్మించింది ఓ కుటుంబం. పహాడీషరీఫ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. ఓ వృద్ధురాలి కలలోకి ఓ బాబా వచ్చి తమ వంశం 600 ఏళ్లుగా ఈ భూమిలో నిద్రిస్తోందని చెప్పాడు. అయితే తిరిగి వారు భూమిపైకి రావాలనుకుంటున్నారని ఇదంత జరగాలంటే ఇంట్లోనే సమాధి నిర్మించాలని బాబా కలలో తనకు చెప్పాడని వృద్ధురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో ఆమె మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే గోతి తీసి సమాధి కట్టారు. ఆ సమాధికి పూజలు నిర్వహించారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో వారిలో కొంతమంది ఆ సమాధికి పూజలు సైతం నిర్వహించారు. అయితే ఇంట్లో నుంచి వింత శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ సమాధిని కూల్చివేశారు. వృద్దురాలితో సహా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కంప్యూటర్ యుగంలో ఇలాంటి మూఢ నమ్మకాల వింత ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.