- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగ రావు, తిరుపతన్నలపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దేశ భద్రతకు సాఫ్ట్ వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్)కింద నమోదు చేసే సైబర్ టెర్రరిజం కేసులు ప్రయోగిస్తారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని అక్రమంగా చొరబడి తస్కరించిన ఈ నలుగురు నిందితులపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్) కేసులు జోడించేందుకు అనుమతి కోరుతూ పంజాగుట్ట పోలీసులు తాజాగా నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నిరూపణ జరిగితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా ఇప్పటికే వీరిపై ఐటీ యాక్ట్ 70 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 70లో 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.