- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దానం నాగేందర్ అంశంలో హైకోర్టు కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
కాగా కష్టకాలంలో పార్టీకి వెన్నుపోటు పొడిచారని దానం విషయంలో బీఆర్ఎస్ ఆగ్రహంతో రగిలిపోతున్నది. కాంగ్రెస్ లో చేరిన దానంను హస్తం పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో దానం నాగేందర్ ఎపిసోడ్ ను మరింత సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని న్యాయపోరాటానికి దిగింది. ఈ విషయంలో ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు.