- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జడ్ ప్లస్’ వలయంలో 10 మంది.. హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణ వద్ద హై అలర్ట్..!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతుండడతో రాష్ట్ర, కేంద్ర పోలీసు భద్రత భారీ స్థాయిలో పెరిగింది. సమావేశాలు జరుగుతున్న తాజ్ కృష్ణ హోటల్‌తో పాటు ఈ మీటింగుకు హాజరైన పలువురు ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్ళ దగ్గర పలు అంచెల భద్రతా వలయం ఏర్పాటైంది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో పాటు కర్ణాటక, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జడ్ ప్లస్ కేటగిరీలో ఉండడంతో పారా మిలిటరీ బలగాలు మోహరించాయి. మరికొద్దిమంది ఆ రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు, మంత్రులు, పార్టీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు జడ్, వై ప్లస్, వై కేటగిరీల్లో ఉండడంతో వారి కోసం కూడా భద్రత కట్టుదిట్టమైంది. తాజ్ కృష్ణ హోటల్ చుట్టూ సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఏర్పాటైంది.
జడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తులు:
సోనియాగాంధీ
రాహుల్‌గాంధీ
ప్రియాంకాగాంధీ
మల్లికార్జున్ ఖర్గే
భూపేశ్ భగేల్ (చత్తీస్‌గఢ్ సీఎం)
సిద్దరామయ్య (కర్ణాటక సీఎం)
సుఖ్వీందర్ సింగ్ సుఖు (హిమాచల్‌ప్రదేశ్ సీఎం)
అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్ సీఎం)
దీపక్ బైజ్ (చత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్)
లాబీ సింగ్ (మణిపూర్ మాజీ సీఎం)