- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కృష్ణా నీటిని పంచండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా నీటి పంపకాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మంగళవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ సుదీర్ఘమైన లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌లోని నీటిని తెలంగాణ, ఏపీకి 50-50 నిష్పత్తిలో కేటాయించాలని, ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు 50 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల జనాభా ఆధారంగా పంపకాలు జరుపాలని, క్యాచ్‌మెంట్ ఏరియా లెక్కన తెలంగాణకు 70.8 శాతం, ఏపీకి 29.2 శాతం నీటి పంపకాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో 34:66 శాతం నిష్పత్తిలో కేవలం ఏడాదికి మాత్రమే కేటాయింపులు చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ట్రిబ్యునల్తీర్పు వచ్చేంత వరకు తెలంగాణకు 50 శాతం కేటాయింపు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణకు 771 టీఎంసీలు కేటాయించాలని గతం నుంచి కోరుతూనే ఉన్నామని, కానీ పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ అవార్డు తుది తీర్పు వచ్చే వరకు 50 శాతం రేషియోలో ఈ ఏడాది నీటి లభ్యతను బట్టి కేటాయింపులు చేయాలని సూచించారు. కృష్ణా బేసిన్‌నుంచి 300 టీఎంసీలను పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారని, 4.7 టీఎంసీలను ఒకేరోజు తరలించేందుకు ప్రాజెక్టులు నిర్మించారని లేఖలో ప్రస్తావించారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్భేటీలో సీఎం కేసీఆర్ కూడా కేంద్రం ముందు ఫిర్యాదు చేశారన్నారు. ఏడేండ్ల నుంచి ట్రిబ్యునల్తీర్పు పెండింగ్‌లో ఉందని, ఈ ఏడాది నీటి లభ్యత ఆధారంగా 50 శాతం కేటాయింపులు చేయాలని లేఖలో కోరారు.