- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్.. నేటి నుంచి తెలంగాణలో వాటికి అనుమతి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పగటి పూట పన్నెండు గంటలు మినహాయించడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు యథావిధిగా పనిచేయనున్నాయి. వంద శాతం ఉద్యోగులు విధులు హాజరుకావచ్చునని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం రాత్రి జారీ చేసిన నూతన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అయితే ఆఫీసులు ఐదు గంటలకే మూసేయాల్సి ఉంటుందని, ఒక గంట పాటు ఇళ్ళకు చేరుకోడానికి వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
సినిమాహాళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్‌లు, క్లబ్‌లు, పబ్‌లు, ఫంక్షన్ హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు, ప్రార్థనా మందిరాలు మూసివేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు బంద్ అవుతాయని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గూడ్సు వాహనాలకు ఆంక్షలు లేకపోయినప్పటికీ ప్రయాణికులకు మాత్రం ఈ-పాస్ ఉంటేనే లాక్‌డౌన్ ఆంక్షల సమయంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలను అమలుచేయాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారని, సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కఠిన లాక్‌డౌన్ ఉంటుందని పేర్కొన్నారు.