- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో లీస్ట్.. పాజిటివ్ కేసుల్లో టాప్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దేశంలో ఆయా రాష్ట్రాల్లో గతేడాది మే నుంచి జనవరి వరకు నమోదైన కరోనా పాజిటివ్ గణాంకాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ రేట్ జనవరి మాసంలో ఒక శాతానికి పడిపోయినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగస్టు మాసం నుంచి కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తున్నట్లు తెలిపారు. జనవరి మాసంలో కేవలం ఒక శాతమే పాజిటివ్ రేటు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
అత్యధిక స్థాయిలో యాంటీజెన్ టెస్టులు
దేశంలో కొవిడ్ టెస్టులు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అతి తక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ అని కేంద్రం తెలిపింది. కేంద్రం లెక్కల ప్రకారం ఫిబ్రవరి 9 నాటికి రాష్ట్రంలో మొత్తం 10,60,226 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్లు వెల్లడించింది. మొత్తం టెస్టుల్లో ఇది కేవలం 15.52 శాతంగా ఉన్నట్లు తెలిపింది. కాగా యాంటీజెన్ టెస్టుల్లో దేశంలో అత్యధిక స్థాయిలో నిర్వహించిన ఘనత తెలంగాణకే దక్కింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 84 శాతం మన దగ్గర రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసినట్లు కేంద్రం వివరించింది. కాగా చిన్న చిన్న రాష్ట్రాల్లో సైతం ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా నిర్వహించారు. దేశంలో 98 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అక్కడ రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయలేదు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 1.55 కోట్ల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాతలో రాజస్థాన్ నిలిచింది. అక్కడ కూడా 98 శాతం ఆర్టీపీసీఆరే చేశారు.
మార్చి 2న కరోనా తొలికేసు
దేశంలో తొలి కరోనా కేసు గతాడేది జనవరి 30న నమోదు కాగా, తెలంగాణలో మార్చి 2న నమోదైంది. అనంతరం వైరస్ వ్యాప్తి పెరుగుతూ వచ్చింది. జూన్ నాటికి దేశంతో పాటు తెలంగాణలోనూ కేసులు భారీగా పెరిగాయి. ఆ తర్వాత నాలుగు మాసాల పాటు కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో జూన్‌లో 36.5 శాతం, జూలైలో 35.2 శాతం పాజిటివ్ రేటు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా పార్లమెంటులో వెల్లడించింది. ఈ స్థాయిలో పాజిటివ్ రేటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ నమోదు కాలేదని గణాంకాల ద్వారా వెల్లడైంది. ముఖ్యంగా భారీగా కేసులు నమోదైన మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా పాజిటివ్ రేటు ఏ దశలోనూ 25 శాతం దాటలేదు. కానీ తెలంగాణలో మాత్రం రికార్డు స్థాయిలో వైరస్ వ్యాప్తి రేటు ఆ రెండు మాసాల్లో ఉందని వెల్లడించారు.
కుదరని లెక్కలు
కేంద్రం తెలంగాణలో జూన్, జూలై మాసాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా పాజిటివ్ రేటు నమోదైనట్లు వెల్లడించగా ఆ రెండు మాసాల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గతంలో వెల్లడించిన గణాంకాలతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. కేంద్ర లెక్కల ప్రకారం జూన్‌లో 36.5 శాతం పాజిటివ్ రేట్ నమోదు కాగా రాష్ట్ర లెక్కల ప్రకారం ఆ మాసంలో 21.73 పాజిటివ్ రేటు నమోదైనట్లు వెల్లడించింది. జూలైలో 35.2 శాతం పాజిటివ్ రేట్ ఉన్నట్లు కేంద్రం వెల్లడిస్తే… రాష్ట్ర లెక్కల ప్రకారం ఆ నెలల్లో కేవలం 13.06 శాతం పాజిటివ్ రేటు ఉన్నట్లు గతంలో వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జూన్‌లో 13,534, జూలైలో 48,446 కొవిడ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి.