- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర మంత్రి హర్దిప్‌సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పట్టణాభివృద్ధి శాఖ, విమానయాన శాఖకు సంబంధించిన.. అంశాలను హర్దిప్‌సింగ్‌కు కేటీఆర్ వివరించారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన.. రూ. 2537 కోట్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
అయితే, తెలంగాణకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని.. కేంద్ర అధికారులకు హర్దిప్‌సింగ్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే.. నూతన పురపాలక చట్టం అంశాలను కేంద్రమంత్రికి వివరించగా.. ఈ విషయం పై అక్టోబర్‌లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని కేంద్ర మంత్రి సూచనలు చేశారు.
వరంగల్‌కు విమాన సేవలు:
వరంగల్ మమునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చాలని కేటీఆర్ కేంద్రమంత్రిని కోరారు. దీంతో త్వరలో బృందాన్ని పంపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. వరంగల్‌కి రన్ వే ఉంది కాబట్టి ముందుగా ఇక్కడ విమాన సేవలు అందించాలని కోరినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.