తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతోంది: మహమూద్ అలీ

by Shyam |   ( Updated:2020-06-02 06:40:24.0  )
తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతోంది: మహమూద్ అలీ
X

దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బిబి పాటిల్.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కేసీఆర్ వలన ఈ రోజు తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి రైతే రాజును చేసే ఉద్దేశ్యంతో సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతు భీమా పథకాన్ని ఇస్తున్నారన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ .. కరోనా కట్టడిలో దేశంలోనే తెలంగాణ ముందు ఉందన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి కరోనా నుంచి రక్షించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ విజయలక్ష్మీ, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మునిసిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతారావు, స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ప్రముఖ నాయకలు, అధికారులు పాల్గొన్నారు.

విలేకరులకు ఆర్థిక సహాయం ఇవ్వాలని హోమ్ మంత్రికి వినతి..

లాక్ డౌన్ సమయంలో విలేకరులకు ప్రత్యేక ఆర్థిక సహాయం (ప్యాకేజీ) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ .. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీకి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

Next Story