- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్మీడియట్‌లో సంస్కృతం..!
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ మీడియట్ విద్యలో సంస్కృత లాంగ్వేజిని ప్రవేశపెట్టేందుకు ఇంటర్ బోర్డు అభిప్రాయల సేకరణ చేపట్టింది. ఇప్పటివరకు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోనే ఉన్న సంస్కృత లాంగ్వేజిని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ప్రవేశపెట్టాలని తెలంగాణ సంస్కృత లెక్చరర్స్ అసోసియేషన్, హైదరాబాద్‌లోని తెలంగాణ సంస్కృత పరిశోధనా పండితుల విభాగం, విద్యార్థి సంఘం ఇంటర్ బోర్డ్‌కు పలు అభ్యర్థనలు చేశాయి.
వీటిని పరిగణలోకి తీసుకున్న ఇంటర్ బోర్డ్ జూనియర్ కాలేజీలలో సంస్కృతాన్ని రెండవ భాషగా ప్రవేశపెట్టేందుకు అవసరాలను, అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు మెమోను జారీ చేసింది. సమిష్టి అభిప్రాయాలు, సూచనలు సేకరించి నివేదికలు సమర్పించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. కేవలం పరిశీలనలు మాత్రమే చేపట్టామని సంస్కతాన్ని ప్రారంభించేందుకు ఎలాంటి ఆదేశాలు ఇప్పటి వరకు జారీ చేయలేదని ఇంటర్ బోర్డ్ శనివారం ప్రకటనను విడుదల చేసింది. ఏదైనా రెండవ భాషను ప్రారంభించడానికి అవసరమైన జూనియర్ లెక్చరర్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, వాటికి సంబంధించిన ఏర్పాట్లను చేయాల్సి వస్తుందని పేర్కొంది.అభిప్రాయాల సేకరణను రెండవ భాషగా ప్రారంభించాలనే ఆదేశాలుగా చూడకూదని స్పష్టం చేసింది.