తెలంగాణలో ఒక్కరోజే 2,426 కేసులు..!

by  |
తెలంగాణలో ఒక్కరోజే 2,426 కేసులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 2,426 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు చేరుకోగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 32,195 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు డిశ్చార్జి అయిన సంఖ్య 1,19,467 చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందగా.. తాజా మరణాలు కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 949 కు చేరింది.

Read Also..

టెస్టులు చేయించుకోకపోవడం వెనక పెద్ద సైకాలజీ


Next Story