ముంబయిని మోడల్‌‌గా తీసుకోండి : దాసోజు శ్రవణ్​

by Shyam |
ముంబయిని మోడల్‌‌గా తీసుకోండి : దాసోజు శ్రవణ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి కోసం రాజకీయాలన్నీ పక్కనపెట్టి పని చేయాలని, సీఎం చెప్పే అంశాలకే తలాడించే నాయకులతో చేసే సమీక్షలతో ప్రయోజనం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బెడ్లు, ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు దొరకక తెలంగాణ సమాజం కష్ట కాలంలో ఉందని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చావు బతుకుల మధ్య వున్న ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ మీద వుందని, కొద్ది రోజులు రాజకీయాలను పక్కన పెట్టాలని హితవు పలికారు.

కరోనా కట్టడిలో ముంబై అద్భుతంగా పనిచేస్తోందని, ఐఏఎస్‌లను దేవర యాంజల్ చుట్టూ తిప్పకుండా ముంబై మోడల్ అధ్యయనానికి పంపాలని శ్రవణ్ సూచించారు. సలహాల కోసం అన్ని రంగాల నిపుణులతో అపెక్స్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్మీని దింపి ప్రైవేట్ హాస్పిటల్స్‌ను స్వాధీనం చేసుకోవాలని, వాటి దోపిడీని అరికట్టాలని, కరోనా టెస్టులను పెంచి, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story