- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోశయ్య అకాల మరణం.. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రోశయ్య ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించాల్సిందిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, తదితరులకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోశయ్య కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రేపు (ఆదివారం) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే, ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సంతాప దినాలను ప్రకటించింది. కాగా, సీఎం కేసీఆర్ మరికాసేపట్లో రోశయ్య నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు.