- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ, ఐటీఐఆర్‌ల ఏర్పాటుకు సన్నాహాలు
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఐటీ, ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మైనింగ్‌కు సంబంధించిన పరిశ్రమలే ఉన్నాయి. ప్రభు త్వం ఐటీ పార్కుల పేరుతో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పారిశ్రామికంగా పరుగులు పెట్టనున్నాయి.
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు టీఎస్ఐపాస్ తో సింగిల్ విండో పద్ధతితో అనుమతి ఇస్తోంది. రంగారెడ్డి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మ ధ్య, భారీ, మెగా పరిశ్రమలు కలిపి మొత్తం 3579 యూనిట్లున్నాయి. వికారాబాద్ జిల్లాలో వేల సంఖ్యలో మైనింగ్ పరిశ్రమలున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కలిపి 247 యూనిట్లు ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో నూతనంగా రెండు పరిశ్రమలు రాబోతున్నాయని పరిశ్రమల శాఖాధికారి తెలిపారు.
ఐటీఐఆర్ కోసం భూ సేకరణ…
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో ఐటీఐఆర్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిశ్రమలకు, పెట్టుబడులకు నిలయంగా మారింది. కందుకూర్ మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ఫార్మాసిటీ, మీర్ఖాన్ పేట్ గ్రామంలో విద్యుత్ కేంద్రం, తుక్కుగూడ మున్సిపాలిటీలో పరిధిలో హార్డ్వేర్ పార్క్, శ్రీనగర్లో ఫ్యాబ్ సిటీ, మైక్రోమాక్స్, మాంఖాల్ పారిశ్రామిక వాడ, విప్రో లాంటి, ప్లాస్టిక్ పార్కులాంటి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించారు. ఈ పరిశ్రమలతో పాటు నాగిరెడ్డి పల్లి గ్రామంలో 198 ఎకరాల్లో ఐటీఐఆర్ పార్క్ స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకోసం 14 సర్వే నెంబర్ల పరిధిలోని 90 మంది రైతులకు సంబంధించిన 198 ఎకరాల భూమిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భూసేకరణలో భాగంగా రైతులకు ఎకరాకు రూ.46లక్షలు చెల్లిస్తామని పరిశ్రమల శాఖాధికారులు వివరిస్తున్నారు. అయితే 90 మంది రైతుల్లో 85 మంది రైతులు పార్క్ ఏర్పాటు కోసం భూమిని ఇస్తామని అంగీకరించారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు..
వికారాబాద్ జిల్లాలో పారిశ్రామికంగా అభివృ ద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జిల్లాలోని శివారెడ్డిపేట, రాకంచర్లలో పారిశ్రామిక కేంద్రాలకు నిలయంగా మారిపోయాయి. మరో మూడు ఇండస్ట్రియల్ పార్కు లకు టీఎస్‌ఐఐసీ ఆమోద ముద్ర వేసింది. తాండూరు మండలం జిన్‌గుర్తి, నవాబుపేట మండలం అర్కతల, మర్పల్లి మండలం ఘనా పూర్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అందుకోసం జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు జిన్‌గుర్తిలో 305 ఎకరాలు, ఘనా పూర్ 330, అర్కతలలో 246 ఎకరాలను గుర్తిం చారు. దీనిపై త్వరలో డీపీఆర్‌ను టీఎ స్‌ఐఐసీ అధికారులు ప్రభుత్వానికి త్వరలో అందజేయనున్నారు. బషీరాబాద్ మండలంలోని కొర్విచెడ్, నవల్గా గ్రామాల పరిధిలో కాలుష్య రహిత పారిశ్రామిక పార్కు ఏర్పా టుకు అడుగులు పడుతున్నాయి. కొర్విచేడ్,నవల్గా ప్రాంతాల మధ్యలోని మూడు సర్వే నెంబర్ల పరిధిలోని మొత్తం 212.28 ఎకరాల భూమిలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయా లని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాం తంలో భూసేకరణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.
ఐటీఐఆర్ పార్కుకోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాలల్లో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. స్థానికంగా అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వాలి. రైతులకు ఏకకాలంలో భూ పరిహారం అందించాలి.
-మాధవచారి, బీజేపీ మండల అధ్యక్షుడు మహేశ్వరం
మరిన్ని పరిశ్రమలకు ప్రతిపాదనలు..
రంగారెడ్డిజిల్లాలో మరిన్ని పరిశ్రమలకు ప్రతిపాదనలు రూ పొం దించాం. టీఎస్ఐపాస్ ద్వారా సింగిల్ విండో ప ద్ధతితో పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నాం. కందుకూర్, మహేశ్వ రం, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకోస్తున్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
-రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి