ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన

by Anukaran |
intermediate exams
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ప్రతీఒక్క విద్యార్థిని పాస్ చేయాల్సిందేనన్న డిమాండ్ నేపథ్యంలో విద్యాశాఖ సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో చర్చించిన విద్యాశాఖ.. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు విద్యాశాఖ అధికారులు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటంతో పాటు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తుండటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 459242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 224012 మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అందరూ పాస్ అయ్యారు.

Advertisement

Next Story