- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమాకు ఎంత కేటాయించారంటే..
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్లను కేటాయించారు. గతేడాది రూ.24,116,57 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ. 883.43 కోట్లను కేటాయించింది. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హారీష్ రావు వ్యవసాయ రంగం అద్బుతమైన ప్రగతిని సాధిస్తుందని కొనియాడారు. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయ రంగమన్నారు. కరోనా కష్ట కాలంలోను తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని ఘంటాపథంగా చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యలేవి ఊరికేపోలేదని, పెట్టిన ప్రతి పైసా సార్థకమయ్యిందని వివరించారు.
రికార్ట్ స్థాయిలో సాగు విస్తీర్ణం:
తెలంగాణలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 2014-15 లో ఉన్న సాగు విస్తీర్ణం కోటి 41 లక్షల ఎకరాలుండగా 2020-21 ఏడాదికి 2 కోట్ల 10 లక్షల ఎకరాలకు పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 49 శాతానికి పైగా వ్యవసాయవృద్ధి నమోదైందని చెప్పారు. పంటల ఉత్పత్తి 2014-15 సంవత్సరంలో 2 కోట్ల 5 లక్షల మెట్రిక్ టన్నులు నమోదు కాగా, 2020-21 లో రికార్డు స్థాయిలో 4 కోట్ల 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి వస్తుందని అంచనా వేసారు. గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి రెట్టింపవుతోందని చెప్పుకొచ్చారు. తెలంగాణలోని రైతులు గడిచిన ఏడాది కాలంలో ల రూ. కోట్ల విలువైన పంటను పండించరని సభామఖంగా వివరించారు.
గణనీయమైన దిగుబడులు:
రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 54 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయడం ద్వారా తెలంగాణ, దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. 2019-20 సంవత్సరంలో తెలంగాణాలో 193 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండగా అందులో 111 లక్షల మెట్రిక్ టన్నులను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సీ.ఐ) తెలంగాణ నుంచే సేకరించిందన్నారు. వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండవ రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా ఎఫ్.సీ.ఐ. ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. 2020 సంవత్సరం యాసంగిలో మన రాష్ట్రం ఎఫ్.సి.ఐ.కి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించిందన్నారు. ఎఫ్.సీ.ఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో 56 శాతం కావడం గమనార్హమని చెప్పారు. ఈ యాసంగి సాగులో తెలంగాణ 52 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 25 లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది, 20 లక్షల 90 వేల ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్నారు.
8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ కు ప్రణాళికలు:
రాష్ట్రంలో 8.14లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించేందుకు ఎకరానికి 30 వేల రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మిగిలిన పెట్టుబడి భారం రైతుపై పడకుండా బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు కార్యాచరణను రూపొందించామన్నారు. రైతులు బ్యాంకుల వద్ద నుంచి తీసుకునే రుణాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా నాలుగేళ్లపాటు మారిటోరియం విధించే విధంగా బ్యాంకులను ఒప్పించిందని చెప్పారు. పామాయిలకు అంతర్జాతీయ డిమాండ్ ఉండటమే కాకుండా, ఈ పంటసాగు వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందనే ప్రోత్సహిస్తున్నామన్నారు. ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాలు దాకా పంట దిగుబడి వస్తూనే ఉంటుందని వివరించారు.
రైతు వేదికలు:
రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రైతువేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఈ రకమైన ప్రయత్నం దేశంలో ఎక్కడా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు. రూ. 572 కోట్ల 22 లక్షల ఖర్చుతో 2,601 రైతు వేదికలను ప్రభుత్వం ఇప్పటివరకు నిర్మించిందన్నారు. పంట ఆరబెట్టుకునేందుకు రూ.150 కోట్ల లక్ష మంది రైతులకు వారి పొలాల దగ్గరే కల్లాలను ప్రభుత్వం తరుపున నిర్మిస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1500 కోట్లు:
ఈ ఆర్థిక ఆర్థిక సంవత్సరంలలో వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు బడ్జెట్ లో ప్రభుత్వం రూ.1500 కోట్ల ప్రతిపాదిస్తుందని ప్రకటించారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం 14,644 ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందజేసింది. రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు, పరికరాల కోసం ఇప్పటి వరకు రూ.951 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు.
రైతుబంధుకు రూ. 14,800 కోట్లు:
ఈ ఏడాది బడ్జెట్ లో రైతుబంధు పథకం కోసం రూ. 14,800 కోట్లను మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. 2018 ఏడాదిలో రైతుబంధు మొదటి దశలో రెండు పంటలకు ఎకరాకు రూ. 8 వేలు పెట్టుబడి సాయం అందించమన్నారు. 2019 సంవత్సరంలో రెండు పంటలకి కలిపి రూ. 10 వేలు రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. ఈ పథకం కింద 2021 వానాకాలం, యాసంగిలో కలిపి 59 లక్షల 25 వేల 725 మంది రైతులకు రూ. 14,736 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. గడిచిన మూడేళ్లలో రైతు బంధు పథకం కింద రూ. 35,911 కోట్లు రైతులకు అందించామన్నారు. లబ్ది పొందిన రైతుల్లో 53 లక్షల 26 వేల 778 మంది 90 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులనని చెప్పుకొచ్చారు.
రుణమాఫీ కోసం రూ. 5,225 కోట్లు కేటాయింపు:
రైతుల రుణమాఫీ కోసం ఈ ఏడాది బడ్జెట్ లో రూ 5,225 కోట్లు ప్రతిపాదించారు.
గత ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని రైతులకు, లక్షలోపు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వగా రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు. త్వరలోనే ఈ రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తామని ప్రకటించారు.
రైతుబీమాకు రూ.1200 కోట్లు:
రైతుబీమా పథకానికి చేఈ ఆర్థిక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలకు పెంచినట్టుగా ప్రకటించారు. రైతు బీమా పథకం సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం రూ.11,41.4 కోట్లను ప్రభుత్వం ఎల్.ఐ.సీ కి చెల్లించిందన్నారు. గత మూడు సంవత్సరాల్లో 46,564 రైతు కుటుంబాలకు రూ. 2,328 కోట్లను రైతుల కుటుంబ సభ్యులఖాతాల్లో జతచేశామని చెప్పారు.
పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,730 కోట్లు:
పశు సంవర్ధక, మత్స్యశాఖకు అభివృద్ధికోసం ఈ బడ్జెట్ లో 1,730 కోట్లను కేటాయించామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి విజయా డెయిరీ పాల సేకరణ సగటున రోజుకు 1,27,462 లీటర్లు మాత్రమే ఉండగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడది 2,89,969 లీటర్లకు పెరిగిందన్నారు. రూ.30 కోట్ల అప్పుతో దయనీయ స్థితి ఉన్నవిజయ డెయిరీ తెలంగాణ ప్రభుత్వం పగ్గాలుచేపట్టిన తర్వాత క్రమక్రమంగా సంస్థను లాభాల బాట పట్టించిందన్నారు. ప్రస్తుతం విజయ డెయిరీ తనకున్న అప్పులు పూర్తిగా చెల్లించడమే కాకుండా, రూ.58.5 కోట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉందన్నారు. విజయడెయిరీ వార్షిక టర్నోవర్ రూ.676 కోట్ల చేరుకుందన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ:
వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనను రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించాలని నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ జరగాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు