- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన నిజంగా ‘తెలంగాణ దేవుడే’
దిశ, సినిమా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హీరో శ్రీకాంత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రస్థానాన్ని చూపించబోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోం మినిస్టర్ మహమూద్ అలీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎన్నో కష్టాలకోడ్చి తెలంగాణ కల సాకారం చేసిన కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ అని కరెక్ట్ టైటిల్ పెట్టారన్నారు మహమూద్ అలీ.
సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆనాటి ఉద్యమం గుర్తొస్తోందన్న శ్రీనివాస్ గౌడ్.. ప్రతీ కులానికి, వర్గానికి సమన్యాయం చేస్తున్న కేసీఆర్ నిజంగానే దేవుడని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని దాసరి శిష్యుడైన డైరెక్టర్ వడత్య హరీష్ ఈ సినిమా తెరకెక్కించడం శుభపరిణామమని దర్శక నిర్మాత, నటులు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన సినిమాకు నందన్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా.. ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.