తెలంగాణలో ఆగని కరోనా కేసులు..

దిశ, వెబ్‌డెస్క్ :

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24గంటల్లో 2,478 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరుకుంది.

ఇందులో 32,994 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,02,024 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24గంటల్లో 10మంది మృతి చెందగా.. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 866కు చేరింది. కాగా, గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 62,543 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement