- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హుజురాబాద్ ఎఫెక్ట్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ మరో సెగ్మెంట్పైనా పడింది. దీంతో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి తన రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగుతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు.
గోషామహాల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని పేర్కొన్నారు. ఉప ఎన్నిక వస్తే కేసీఆర్‌కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తోందని, అంతేకాకుండా గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం రూ. 10 లక్షలు ఇవ్వాలని, ఇస్తే ఖచ్చితంగా స్పీకర్ దగ్గరకు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు సైతం రాజా సింగ్ రాజీనామా చేసిన విషయం విధితమే. మరోసారి ఆయన రాజీనామా స్వరం అందుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.