తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు

దిశ, న్యూస్‌బ్యూరో: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మార్చి నెలలో నియమితులైన తర్వాత ఐదు నెలలకు ఆదివారం పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. ఈ నూతన కమిటీలో ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు కోశాధికారులు, ఒక ఆఫీస్ కార్యదర్శి కలిపి మొత్తం 23మంది రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. నూతన రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది. సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో కూడిన రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ సంఘాల బాధ్యులను కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

ఉపాధ్యక్షులు : విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి
ప్రధాన కార్యదర్శులు: ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు
కార్యదర్శులు: రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి.
కోశాధికారులు: బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌)
ఆఫీస్‌ సెక్రటరీ: ఉమా శంకర్‌
అధికార ప్రతినిధులు: కృష్ణ సాగర్ రావు, రజినీ కుమారి, రాకేష్ రెడ్డి

బీజేపీ అనుబంధ సంఘాల్లో భారతీయ యువ మోర్చా అధ్యక్షుడిగా భాను ప్రకాష్, మహిళ మోర్చా – గీతా మూర్తి, కిసాన్ మోర్చా – కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా – కొప్పుల బాషా, ఓబీసి మోర్చా- అలె భాస్కర్, మైనార్టీ మోర్చా – ఆస్ఫర్ పాషా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

ట్యాగ్స్: తెలంగాణ, బీజేపీ, రాష్ట్ర కమిటీ, బండి సంజయ్, ఉపాధ్యక్షులు, విజయ రామారావు, సంకినేని, ఎండల లక్ష్మీనారాయణ, రఘునందన్‌రావు, యువ మోర్చా
స్లగ్: తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు

Advertisement