- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా తీజ్ వేడుకలు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన యువతులు.. ఫోటోలు వైరల్
దిశ, ఆమనగల్లు : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అయిన తీజ్ వేడుకలను బుధవారం కడ్తాల మండలం మైసిగండిలో ఘనంగా జరుపుకున్నారు. తీజ్ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వారి బంధువులు భారీగా తరలి రావడంతో మైసిగండి జనసంద్రమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు తీజ్ వేడుకలు కొనసాగాయి. చిన్నారుల మొదలు వృద్ధుల వరకు గిరిజనులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు వేడుకలో పాల్గొన్నారు. ఎంపీపీ కమ్లి మోత్య నాయక్, సర్పంచ్ తులసిరాం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ దశరథ్ నాయక్, జిల్లా డీసీబీబీ డైరెక్టర్ గంప వెంకటేష్, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి, పీసీసీ సభ్యులు అయిల్ల శ్రీనివాస్ గౌడ్ వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
గిరిజన యువతులు తమ ఆచారం ప్రకారం ప్రజా ప్రతినిధులకు మొలకలను అందజేసి తీజ్ శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ వేడుకల్లో యువతీయువకులు డ్యాన్సులు చేశారు. గిరిజనుల వేషధారణతో చిన్నారులు యువతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 9 రోజులు పాటు పూజలు చేసి వేయించిన మొలకల బుట్టలను ఆలయంలో ఉంచారు.
అనంతరం పెళ్లి కానీ యువతులు, చిన్నారులు పట్టు వస్త్రాలు ధరించి బుట్టలను నెత్తిన పెట్టుకొని తండాలో ఊరేగింపు నిర్వహించారు. తమను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని గిరిజనులు పూజలు చేశారు. మొలకలున్న బుట్టలను ఎత్తుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళలో ఈ గోధుమలు అలికిన బుట్టలో నీళ్ళు పోస్తూ వాటిని పూజించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింభించేలా ర్యాలీలో బ్యాండు వాయిద్యాలు డీజేలను ఏర్పాటు చేశారు. అనంతరం మొలకల బుట్టలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.
- Tags
- celebrations