ఖర్చులేకుండా ప్రపంచం మొత్తం చుట్టేయాలనుందా.. అయితే ఇలా చేయండి..

by Sumithra |
ఖర్చులేకుండా ప్రపంచం మొత్తం చుట్టేయాలనుందా.. అయితే ఇలా చేయండి..
X

దిశ, ఫీచర్స్ : ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రయాణించాలంటే ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి ప్రపంచాన్ని చుట్టి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయలేం. అయితే కొంతమందికి ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరికతో ఉన్నా వారికి ఉన్న బడ్జెట్ ప్రాబ్లం కారణంగా ప్రపంచ పర్యటనకు చెక్ పెడతారు. అలాంటి వారి కోసమే Google Earth మంచి ఫీచర్ ను తీసుకువచ్చింది. అది ఏంటంటే గూగుల్ ఎర్త్ ద్వారా వర్చువల్‌గా మొత్తం ప్రపంచాన్ని పర్యటించవచ్చు. అది కూడా ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా. అబ్బ ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అనుకుంటున్నారు కదా. మరి ఉచితంగా ప్రపంచ పర్యటన ఎలా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ ఎర్త్ అనేది ప్రపంచంలోని ఏ ప్రదేశాన్నైనా 360-డిగ్రీల కోణంలో చూపిస్తుంది. దీంతో మీరు ఇంటి నుండి బయటకు కాలు పెట్టకుండా ప్రపంచం మొత్తం చుట్టేయవచ్చు. కానీ దీని కోసం మీరు ఒక చిన్న పని చేయవలసి ఉంటుంది. అది ఏంటంటే మీరు మీ కంప్యూటర్ లేదా మొబైల్‌లో ఇంటర్నెట్ బ్రౌజర్‌ని తెరిచి, Google Earth అని సెర్చ్ చేయాలి. ఇప్పుడు Google Earthని తెరిచి, మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశం పేరును ఎంటర్ చేయాలి. తర్వాత దానిపై క్లిక్ చేస్తే 360 - డిగ్రీల కోణంలో మీరు అనుకున్న ప్రదేశం కనిపిస్తుంది. ఇలా మీరు మీ వర్చువల్ వరల్డ్ టూర్ ని పూర్తి చేయవచ్చు.

తాజ్ మహల్ నుండి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వరకు అన్నింటినీ సందర్శించవచ్చు..

Google Earth తో మీరు మీకు ఇష్టమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక ప్రదేశాలు, స్మారక చిహ్నాలను మీకు చూపిస్తుంది. దీంతో మీరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్ మహల్ లేదా కొలోసియం వంటి ప్రదేశాలను సందర్శించగలరు. మీరు ప్రకృతి ప్రేమికులైతే ఎవరెస్టు పర్వతం, గ్రాండ్ కాన్యన్ లేదా గ్రేట్ బారియర్ రీఫ్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

Advertisement

Next Story