- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొబైల్ ప్రియులకు షాక్.. రేపటి నుంచి వాట్సాప్ బంద్..!

దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పుడు ఉన్న సమాజంలో తినడానికి తిండి లేకపోయిన బతుకుతున్నారు. కానీ, ఫోన్ లేక పోతే మాత్రం క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అంతలా ఫోన్‌లకు అలవాటు అయిపోతున్నారు ప్రజలు. అయితే ఫోన్‌లకు ఎడిక్ట్ అయిన యూజర్లకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది వాట్సాప్. రేపటి నుంచి ఫోన్లలో వాట్సాఫ్ సేవలను బంద్ చేస్తున్నట్లు టెక్ కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు ప్రకటించాయి. సాంకేతికంగా వస్తున్న మార్పుల దృష్ట్య కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకొస్తుంది. అందువల్ల పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలను రద్దుచేయనున్నారు. ఈ మార్పు వల్ల రేపటి నుంచి వాట్సాప్ సేవలకు అంతరాయం కలుగనుంది. అయితే ఈ అంతరాయం అన్ని ఫోన్‌లకు కాదు.. ఏయో ఫోన్‌లు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కొన్ని మోడల్స్‌కు రేపటి నుంచి సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది వాట్సాప్. ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఓఎస్‌తో పనిచేస్తున్న ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు. ప్రస్తుతం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ ఫోన్లు ఈ ఓఎస్‌లతో పనిచేస్తున్నాయి. యాపిల్ నిబంధనల ప్రకారం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్ మోడల్స్‌లో ఓఎస్ అప్‌డేట్ కాదు. కేవలం ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ మోడల్స్ మాత్రమే ఓఎస్ అప్‌డేట్‌కు అవకాశం ఉంది. అంతే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా వాట్సాప్ కీలక సూచన చేసింది. ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.