- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
WhatsApp: వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఇక మీ చాట్ కష్టాలకు చెక్
దిశ, వెబ్ డెస్క్: వాట్సప్ (Whats App) స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరి జీవితంలో భాగమైన ప్రముఖ మెసేజింగ్ యాప్ ఇది. తొలుత మెసేజ్ లతో వచ్చిన ఈ యాప్.. ఆ తర్వాత ఒక్కో ఫీచర్ ను తీసుకొస్తోంది. ఆడియో కాల్స్, వీడియో కాల్స్, వీడియో కాల్ ఫిల్టర్స్, ఆడియో స్టేటస్, వీడియో స్టేటస్, చాట్ లాక్, ఆర్కైవ్స్, వాట్సప్ గ్రూప్స్, బ్రాడ్ కాస్ట్స్, ఛానల్స్.. ఇలా చాలా ఫీచర్లను పరిచయం చేసింది. మరో సోషల్ మీడియాను వాడే అవసరం లేకుండా అన్నీ ఇక్కడే ఉండేలా అభివృద్ధి చేస్తోంది మెటా సంస్థ. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే కస్టమ్ లిస్ట్ (Whats App Custom List). చాట్ లిస్ట్ ను ఫిల్టర్ చేసే కొత్త ఫీచర్ ఇది.
మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే.. చాట్ లిస్ట్ కనిపిస్తుంది. గ్రూప్స్, పర్సనల్ చాట్స్, ప్రొఫెషనల్ చాట్స్ చాలానే ఉంటాయి. అంతపెద్ద లిస్ట్ లో మనకు కావలసినవారితో మాట్లాడాలన్నా, మెసేజ్ చేయాలన్నా సెర్చ్ బార్ లో వెతకాల్సిందే. కస్టమ్ లిస్ట్ ఫీచర్ తో ఇక ఆ బాధ ఉండదు. మీకు నచ్చిన లిస్ట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. వారితో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ లిస్ట్ ఓపెన్ చేస్తే చాలు. వాట్సాప్ తమ యూజర్లకు కమ్యూనికేషన్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) తన వాట్సప్ ఛానల్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.