Vivo earbuds: 42 గంటల బ్యాటరీ లైఫ్‌, AI ఫీచర్స్‌తో Vivo ఇయర్‌బడ్స్

by Harish |
Vivo earbuds: 42 గంటల బ్యాటరీ లైఫ్‌, AI ఫీచర్స్‌తో Vivo ఇయర్‌బడ్స్
X

దిశ, టెక్నాలజీ: స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo ఇండియాలో అధునాతన స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇయర్‌బడ్స్‌ను సైతం విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ ‘Vivo TWS 3e’ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇది నాయిస్ రిడక్షన్ డిసేబుల్‌తో 42 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. బయట నుంచే వచ్చే సౌండ్స్‌ను కట్టడి చేయడానికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బ్యాక్డ్ కాల్ నాయిస్ రిడక్షన్ అల్గారిథమ్‌ని దీనిలో అందించారు. మ్యూజిక్ లేదా సినిమాల సమయంలో వినియోగదారులకు మెరుగైన బేస్, సౌండ్ క్వాలిటీ వస్తుందని కంపెనీ తెలిపింది.

బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని దీనిలో అందించారు. దీంతో డివైజ్‌లకు వేగంగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఇది డ్యూయల్ పేరింగ్ కనెక్టివిటీని సైతం కలిగి ఉంది. ముఖ్యంగా ఇయర్‌బడ్‌ను పోగొట్టుకున్నట్లయితే ఫైండ్ మై ఇయర్‌ఫోన్స్ ఫీచర్‌ ద్వారా కనిపెట్టవచ్చు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌తో వచ్చింది. టచ్ కంట్రోల్ ద్వారా దీనిని ఆపరేటింగ్ చేయవచ్చు. ప్రతి ఇయర్‌బడ్ ANC డిసేబుల్‌తో గరిష్టంగా 8.5 గంటల పాటు వాడుకోవచ్చు. 10 నిమిషాల చార్జింగ్‌తో ఇయర్‌బడ్‌లు మూడు గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలవని కంపెనీ పేర్కొంది. ఇయర్‌ఫోన్‌లు డీప్‌ఎక్స్ 3.0 సౌండ్ ఎఫెక్ట్‌లను కూడా కలిగి ఉంటాయి. వీటి ధర రూ.1,899. వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed