- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
VIVO: వివో లవర్స్‌కు గుడ్‌న్యూస్.. అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్.. డేట్ ఎప్పుడంటే?

VIVO T4X 5G India Launch Date: ఎట్టకేలకు వీవో భారత్ లో తన వివో T7x 5G(VIVO T4X 5G) స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. అంతేకాదు ఈ అప్ కమింగ్ ఫోన్ లోని ముఖ్యమైన కొన్ని ఫీచర్లు, ప్రైస్ రేంజ్ కూడా టీజ్ చేసింది. అదనంగా ఈ ఫోన్ డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బిల్డ్ వివరాలతోపాటు అనేక ఇతర స్పెసిఫికేషన్లు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ (Flipkart)ఈ అప్ కమింగ్ వివో T7x 5G (VIVO T4X 5G) ఫోన్ లోని ముఖ్యమైన ఫీచర్లను షోకేజ్ చేసేందుకు ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. ఈ హ్యాండ్ సెట్ భారత్ లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రారంభించిన వివో T3x 5G స్మార్ట్ ఫోన్ కు సక్సెసర్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ అప్ కమింగ్ T4x 5G(VIVO T4X 5G) స్మార్ట్ ఫోన్ దాని సెగ్మెంట్ లో అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది
కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో తన వీవో T4x 5G ఫోన్ భారత్ మార్చి 5, 2025న మధ్యాహ్నం 12గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీని లాంచ్ తర్వాత ఇది భారత్ లో ఫ్లిప్ కార్ట్, వివో ఈ స్టోర్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్ ల ద్వారా సేల్స్ కి అందుబాటులోకి రానుంది. ఆన్ లైన్ లో షేర్ చేసిన ప్రమోషనల్ పోస్టర్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పర్పుల్ అండ్ బ్లూ కలర్స్ లో కన్పిస్తుంది. మరోవైపు ఇది ప్రొంటో పర్పుల్, మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ తో రానున్నట్లు లీక్స్ ను బట్టి తెలుస్తోంది.
ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు చూసినట్లయితే 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నెట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.78 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉండొచ్చు. ఈ డివైజ్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ ద్వారా పవర్ పొందుతుంది. కంపెనీ దీన్ని 6జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో తీసుకువచ్చే అవకాశం ఉంది. దీన్ని టీబీ వరకు పెంచుకోవచ్చని తెలుస్తోంది.
కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో రావచ్చు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండవచ్చు. ఈ డివైజ్ 6,500ఎంఏహెచ్ బ్యాటరీతో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. వీటితోపాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఏఐ ఎరేస్, ఏఐ ఫొటో ఎన్ హాన్స్ ఏఐ డాక్యుమెంట్ వంటి ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఐఆర్ బ్లాస్టర్ ను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
వివో భారత మార్కెట్లో వివో T4x 5G ధరను రూ. 15,000కంటే తక్కువగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని మునుపటి వీవో T3x 5G ఫోన్ ధర 128జీబీ స్టోరేజీ కాన్ఫిగరేషన్ లో రూ.12,499 నుంచి ప్రారంభం అవుతుంది.