తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారా.. ఇది మీ కోసమే

by Sumithra |
తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారా.. ఇది మీ కోసమే
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ వాడకం మొదలైనప్పటి నుంచి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సోషల్‌ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంతే కాదు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రిపడుకునే వరకు సోషల్ మీడియాను చూస్తూ ఉండి పోయేంతగా ఎడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియాను ఇంతగా వాడుతున్న వారిపై ఎలాంటి దుష్ప్రభావాలు పడుతున్నాయి, వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను ఎక్కువగా చూడడం వలన అభద్రత భావం, ఆత్మన్యూనత వంటి మానసిక ఆందోళనకు గురవుతారని చెబుతున్నారు. అంతే కాదు సోషల్‌ మీడియాలో ప్రచారమయ్యే ప్రతివిషయాన్ని నిజమే కావచ్చే అనే భావనలో ఉండి వారిని వారే తక్కువ చేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఓ వ్యక్తి మానసిక ఆరోగ్యం పై సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాను ఎంత తక్కువగా వాడితే మానసిక ఆరోగ్యం అంత త్వరగా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సోషల్‌ మీడియా వాడకాన్ని రోజుకు 30 నిమిషాలైనా తగ్గిస్తే మంచిదంటున్నారు. దీంతో వారు చేసే పని పై ఏకాగ్రత, నిగ్రహం పెరిగి పనిని సంపూర్ణంగా చేస్తారని చెబుతున్నారు.

కొంతమంది శాస్త్రవేత్తలు ఓ అధ్యయణంలో భాగంగా కొంతమందిని ఎంపిక చేసి వారిని పరిశీలించారంట. వారిలో కొంతమందిని ఎంపిక చేసి రెండు గ్రూపులుగా విడగొట్టారట. అందులో ఒక గ్రూప్ వారు సోషల్‌ మీడియాను వాడడం 30 నిమిషాలు తగ్గించేలా చేశారని, మరికొంతమందిని యథావిధిగా వాడాలని చెప్పారట. ఈ ఎక్స్పర్మెంట్ లో సోషల్‌ మీడియాను తక్కువగా వాడేవారి మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని నిపుణులు చెబుతున్నారు. చూశారుగా మీరు కూడా అధికంగా సోషల్ మీడియాను వాడేవారైతే వెంటనే ఆ అలవాటును తగ్గించుకోండి.

Advertisement

Next Story

Most Viewed