ఎట్టకేలకు మార్కెట్లోకి Coca-Cola స్మార్ట్ ఫోన్

by Harish |
ఎట్టకేలకు మార్కెట్లోకి Coca-Cola స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Realme 10 Pro Coca-Cola ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో శుక్రవారం విడుదలైంది. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ ప్రత్యేకంగా కోకా-కోలా లోగోను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 14 న మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart, Realme ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి ఉంటుంది.


Realme 10 Pro Coca-Cola ఎడిషన్ ఫోన్ 6.72-అంగుళాల పూర్తి-HD+ (1,080x 2,400 పిక్సెల్‌లు) LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. Adreno A619 GPUతో స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ద్వారా రన్ అవుతుంది. ఫోన్‌లో బ్యాక్ సైడ్ 108-మెగాపిక్సెల్ Samsung HM6 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా అందించారు. అలాగే, ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.



Advertisement

Next Story

Most Viewed