50 గంటల బ్యాటరీ లైఫ్ అందించే Ptron ఇయర్‌బడ్స్.. ధర, పూర్తి వివరాలు ఇవే!

by Harish |
50 గంటల బ్యాటరీ లైఫ్ అందించే Ptron ఇయర్‌బడ్స్.. ధర, పూర్తి వివరాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: Ptron కంపెనీ నుంచి కొత్తగా భారత మార్కెట్లోకి ఇయర్‌బడ్‌లు లాంచ్ అయ్యాయి. వీటి పేరు ‘Ptron Basspods Encore’. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ప్లేబ్యాక్ టైం 50 గంటల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇయర్‌బడ్స్ ధర రూ. 899. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇవి బ్లాక్, బ్లూ, బూడిద కలర్స్‌లో లభిస్తాయి.


10mm డైనమిక్ డ్రైవర్‌లు, అత్యత్తమ బేస్‌ను అందిస్తాయి. USB టైప్-C ద్వారా చార్జింగ్ చేయవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే, చార్జింగ్ కేస్‌తో కలిపి 50 గంటల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ తెలిపింది. వీటిలో నాలుగు HD మైక్‌లు, TruTalk ENC ఉన్నాయి. ఇయర్‌బడ్‌లు IPX4 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. వీటిలో మ్యూజిక్ కంట్రోల్, కాల్ ఆన్సర్, కాల్ హ్యాంగ్‌అప్, కాల్ రిజెక్ట్, వాయిస్ అసిస్టెంట్‌, టచ్ కంట్రోల్‌ సపోర్ట్ మొదలగు ఫీచర్స్ ఉన్నాయి.



Advertisement

Next Story

Most Viewed