- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నథింగ్ ఫోన్ 2.. ముందస్తు బుకింగ్ తేదీ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: యూకే ఆధారిత స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2 జులై 11న ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ తెలిపింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 29, మధ్యాహ్నం 12 గంటల నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.
వినియోగదారులు ప్రీ-ఆర్డర్ కోసం రూ. 2,000 చెల్లించాలి. ఆ తర్వాత జులై 11న రాత్రి 9 గంటల నుంచి జులై 20 రాత్రి 11.59 గంటల మధ్య నచ్చిన వేరియంట్‌ను ఎంచుకోవాలి. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించిన తరువాత ఫోన్‌ను డెలివరీ చేస్తారు. కొనుగోలు సమయంలో క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు ఉంటాయి. నథింగ్ ఫోన్ 2 ని ప్రీ-ఆర్డర్ చేసిన వారికి నథింగ్ ఇయర్ (స్టిక్) పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, వినియోగదారులు నథింగ్ యాక్సెసరీస్‌పై 50 శాతం తగ్గింపు పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 1 కి కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2 వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా పనిచేస్తుంది. ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్‌లో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సల్ ఉంటుందని సమాచారం.
Read More..