Solar Eclipse 2024: గూగుల్ స్పెషల్ యానిమేషన్ అదుర్స్..

by Ramesh N |
Solar Eclipse 2024: గూగుల్ స్పెషల్ యానిమేషన్ అదుర్స్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేడు అత్యంత ఆకర్షణీయమైన ఖగోళ సంఘటన ఆవిష్కృతం కానుంది. మరికొన్ని గంటల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి అని, 1970 లో చివరిసారిగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా సూర్యగ్రహణం 1 నిమిషం కంటే ఎక్కువ సమయం ఉండదని, కానీ నేటి సూర్యగ్రహణం 4 నిమిషాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే సంపూర్ణ సూర్యగ్రహణంపై గూగుల్ స్పెషల్ యానిమేషన్ క్రియేట్ చేసింది. గూగుల్‌ సెర్చ్‌లో Solar eclipse అని టైప్ చేస్తే గూగల్ పేజీ డెస్క్‌టాప్‌పై మనకు సూర్యగ్రహణం గ్రాఫిక్స్ కనబడుతోంది. మరోవైపు గ్రహణం గురించి పూర్తి స్థాయి సమాచారం మనకు గూగుల్ అందజేస్తుంది. కాగా, స్పెషల్ ఈవెంట్స్ ఉన్న సమయంలో గూగుల్ ఇలాంటి గ్రాఫిక్స్ చేసి సెలబ్రేషన్స్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది.



Next Story

Most Viewed