- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Google pay: గూగుల్ పే యూజర్లకు షాక్.. ఇకపై ఆ బిల్లు చెల్లింపులకు బాదుడే బాదుడు!

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' (Google pay) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూనిఫైడ్ ఇంటర్‌ఫేస్ పేమెంట్స్ (UPI) సహా ఇతర బిల్లు చెల్లింపుల కోసం జనం ఎక్కువగా GPayను వినియోగిస్తుంటారు. పైగా ఇందులో పూర్తి ఉచితంగా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. కానీ, ఇకపై అలా కుదరదు. ఫోన్ పే, పేటీఎం తరహాలోనే గూగుల్ పే కూడా కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేయనుంది.
ఇకపై గూగుల్ పే (GPay) యాప్ ద్వారా చేసే విద్యుత్, గ్యాస్, DTH సహా ఇతర బిల్లు పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేయనుంది. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్‌పై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు కన్వీనియెన్స్ ఫీజు, దీనికి అదనంగా వస్తు, సేవల పన్ను (GST) కూడా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై గూగుల్ పే నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.
అయితే, యూపీఐ లావాదేవీలకు మాత్రం ఈ ఛార్జీలు వర్తించవు. కాగా, పేటీఎం, ఫోన్‌పే సంస్థలు ఇప్పటికే ఈతరహా ఫీజును వసూలు చేస్తుండగా.. ఇన్ని రోజులు ఉచితంగా అందించిన గూగుల్ పే సైతం ఇక నుంచి వాటి బాటలోనే నడవనుంది. అయితే గూగుల్ పే గత ఏడాది నుంచి మొబైల్ రీఛార్జీలపై రూ.3 కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయటం ప్రారంభించింది.
దేశంలో డిజిటల్ పేమెంట్స్‌కు విపరీతంగా ఆదరణ లభిస్తోంది. అందుకే దీనిని క్యాష్ చేసుకునేందుకు ఆయా పేమెంట్స్ యాప్ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.