ఇండియాలో తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన Samsung

by Harish |   ( Updated:2022-12-09 13:28:17.0  )
ఇండియాలో తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన Samsung
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్ భారత్‌లో కొత్తగా బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఆ మోడల్ పేరు 'Samsung Galaxy M04'. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 8,499 తో అందుబాటులో ఉంది. 8GB RAM+128GB వరకు స్టోరేజ్‌‌లో కూడా ఫోన్ లభిస్తుంది. ఫోన్ డిసెంబర్ 16, మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వస్తుంది. అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది.


Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్

* 6.5-అంగుళాల HD+ LCD స్క్రీన్‌, 20x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌.

* MediaTek Helio P35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ one UI తో రన్ అవుతుంది.

* బ్యాక్‌సైడ్ 13MP ప్రైమరీ+ 2MP మాక్రో కెమెరా ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 5MP కెమెరా ఉంది.


* మైక్రో SD కార్డ్‌ ద్వారా మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు.

* 10W చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

* ఇది బ్లాక్, గ్రీన్ కలర్‌లో లభిస్తుంది.



Advertisement

Next Story