- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలాక్సీ ఏ35 5జీ, ఏ55 5జీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన శాంసంగ్
దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ శాంసంగ్ భారత మార్కెట్లో తన కొత్త గెలాక్సీ ఏ35 5జీ, ఏ55 5జీ మొబైళ్లను సోమవారం విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల అమోల్‌డ్ స్క్రీన్, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరాలతో వచ్చాయి. అలాగే, ఆండ్రాయిడ్ 14 బేస్‌డ్ వన్ యూఐ 6.1 వెర్షన్‌తో పనిచేస్తాయి. 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్‌తో పాటు ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ తెలిపింది. 25 వాట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్న ఈ ఫోన్‌లు 5000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఫీచర్లకు సంబంధించి.. రెండు ఫోన్‌లూ 5జీ కనెక్టివిటీతో పాటు వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ, లైట్ సెన్సార్, జియో మ్యాగ్నటిక్ సెన్సార్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కెమెరా వంటి ఆధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్‌తో రెండు ఫోన్‌ల బ్యాటరీలు కూడా 83 గంటల పాటు ఆడియో ప్లే బ్యాక్ టైం వస్తాయని కంపెనీ పేర్కొంది. రెండు ఫోన్‌ల ధరల వివరాలను ఈ వారంలోనే వెల్లడిస్తామని శాంసంగ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.