మనుషులతో ఫుట్‌బాల్ ఆడుతున్న రోబోలు! మనిషి మనుగడకే ప్రమాదమా?

by Ramesh N |   ( Updated:2024-03-13 06:55:08.0  )
మనుషులతో ఫుట్‌బాల్ ఆడుతున్న రోబోలు! మనిషి మనుగడకే ప్రమాదమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ చాలా వేగంగా పెరుగుతున్నది. రోబోటిక్స్ టెక్నాలజీని మనుషుల నిత్య జీవితంలో తీసుకరావడానికి శాస్త్రవేత్తలు కొత్త కొత్త రోబో యంత్రాలను కనిపెడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నెట్టింట్లో ఓ మనిషి రోబోలతో ఆట ఆడుతున్న వీడియో వైరల్ అవుతుంది. మనం వీడియో గేముల్లో రోబోట్‌లతో ఫుట్ బాల్ గేమ్ ఆడుతాము. కానీ లైవ్‌లో రోబోట్‌లతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడే రోజులు వస్తాయేమో? ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఓ వ్యక్తి రెండు రోబోలతో కలిసి మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్నాడు. అవి కూడా బాల్‌ను కాలితో అతడికి అచ్చం మనిషి అడినట్లుగానే పాస్ చేస్తుంటాయి. ఈ ఆశ్చర్యకరమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ తో చేసిన డీప్ ఫేక్ వీడియో అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ ఎంత వరకు దారితీస్తుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రోబోలు తయారు చేస్తే మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ముఖ్యంగా వైద్యరంగంలో రోబోటిక్స్ టెక్నాలజీ ఉపయోగించి పెద్ద పెద్ద సర్జరీలను సునాయాసంగా డాక్టర్లు చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లో చూపించే విధంగా మనుషుల పోలిన రోబోల తయారీపై నిపుణులు దృష్టిపెట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ అలాంటి రోబోలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story