ఎయిర్‌ఫైబర్ యూజర్లకు కొత్త బూస్టర్ డేటా ప్లాన్‌లు తెచ్చిన జియో

by S Gopi |   ( Updated:2024-02-03 13:31:34.0  )
ఎయిర్‌ఫైబర్ యూజర్లకు కొత్త బూస్టర్ డేటా ప్లాన్‌లు తెచ్చిన జియో
X

దిశ, టెక్నాలజీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఎయిర్‌ఫైబర్ యూజర్ల కోసం కొత్తగా రెండు అదనపు డేటా ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. నెలవారీగా వచ్చే అన్‌లిమిటెడ్‌ డేటా పూర్తయిన తర్వాత అదనపు డేటా అవసరమైన వారికోసం ఈ డేటా బూస్టర్ ప్లాన్‌లను జియో అందిస్తోంది. వాటి ధరలు రూ. 101, రూ. 251గా ఉన్నాయి. డేటా బూస్టర్ రూ. 101 ప్లాన్‌తో 100జీబీ డేటాను, రూ. 251తో 500జీబీ డేటాలను వాడుకోవచ్చు. వీటికి వ్యాలిడిటీ ఉండదు. సాధారణ ప్లాన్‌కు ఉన్న గడువు వరకు ఈ డేటాను ఉపయోగించవచ్చు. ఇప్పటికే జియో రూ. 401తో బూస్టర్ డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ కింద అదనంగా 1టీబీ డేటా లభిస్తుంది. జియో తన ఎయిర్‌ఫైబర్ సేవలను గత దీపావళికి ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఎయిర్‌ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కేబుల్ అవసరం లేకుండా 5జీ ఎయిర్‌ఫైబర్ సేవలు అందించేందుకు రెగ్యులర్, మ్యాక్స్ పేర్లతో మొత్తం ఆరు ప్లాన్‌లను జియో అందిస్తోంది. అవి రూ. 599 నుంచి రూ. 3,999 మధ్య ధరల్లో లభిస్తున్నాయి.

Read More..

ఏపీ, తెలంగాణలో 30 ముత్తూట్ మైక్రోఫిన్ బ్రాంచ్‌లు: సీఈఓ

Advertisement

Next Story

Most Viewed