- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాట్సాప్‌కి పోటీగా RCS.. నెట్ అవసరం లేకుండానే మెసేజ్ లు
దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో మిత్రులతో, బంధువులతో కమ్యూనికేషన్ లో ఉండాలనుకునేవారు ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ ఉంటారు. అలాగే మెసేజెస్ చేయాలనుకునేవారు వాట్సాప్, మెసెంజర్ ద్వారా తమ సందేశాలను పంపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వాట్సాప్‌కు పోటీగా కొత్త ప్లాట్‌ఫాం అందుబాటులోకి వచ్చేసింది. ఇది Apple కి చెందిన iMessageతో పోల్చుతున్నారు. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) SMS, Whatsapp లకు గట్టిపోటీని ఇవ్వబోతోందని ఇప్పటికే చాలా నివేదికలలో చెప్పారు. ఇది Google ద్వారా మార్కెట్‌లో ప్రారంభించిన భిన్నమైన సేవ.
ఇది ఎలా పని చేస్తుంది ?
RCS సహాయంతో ఎవరికైనా సందేశాన్ని, ఎమోజీలను పంపవచ్చు. అలాగే మల్టీమీడియాను కూడా ఇందులో ఉపయోగించవచ్చు. సాధారణంగా మీరు SMS పంపడానికి సెల్యులార్ ఫోన్లో నెట్ అవసరం. కానీ ఇందులో రెండు రకాలుగా సందేశాలు పంపవచ్చును.
ఇంటర్నెట్ సహాయంతో, ఇంటర్నెట్ లేనప్పుడు కూడా సందేశాలు చేరవేయవచ్చు. మీరు RCSలో చాట్ చేస్తే, అది ఇతర వినియోగదారుకు 'టైపింగ్' కూడా చూపుతుంది. ప్రస్తుతం ఇది చాలా Android పరికరాల్లో అందుబాటులో ఉంది. మీరు RCSలో గ్రూప్ చాట్, ఫోటో షేరింగ్ కూడా చేసే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్‌లో దీన్ని ఎలా ఉపయోగించవచ్చు ?
ఈ సదుపాయం ప్రస్తుతం ఐఫోన్ కోసం ఇంకా అందుబాటులోకి రాలేదు. 2024 చివరి నాటికి దీన్ని ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారని నివేదికలో వెల్లడించారు. అయితే ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఫీచర్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సేవను గూగుల్ 2007లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఆ సంస్థ నిరంతరం కృషి చేస్తోంది.